జపాన్‌లో ఘోరం.. కత్తితో వీరంగం.. కనిపించినోళ్లని పొడిచేశాడు..

మంగళవారం, 28 మే 2019 (11:11 IST)
జపాన్‌లో ఘోరం జరిగింది. కనిపించిన వాళ్లను పొడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఓ దుండగుడు. ఆపై తనను తాను గాయపరుచుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని కవసాకి నగరంలోని నోబోరిటో రైల్వే స్టేషన్ వద్ద.. మంగళవారం ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్లు కత్తితో పొడిచేశాడు. ఈ ఘటనలో 16మంది గాయాలపాలయ్యారు. 
 
గాయపడిన వారిలో ఎనిమిది మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వున్నారు. కత్తితో ఓ వ్యక్తి దాడికి పాల్పడటంతో భయంతో రైలు ప్రయాణీకులు పరుగులు తీశారు. అయితే 16మందిని గాయపరిచిన తర్వాత నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. 
 
ఈ సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వయస్సు 50 ఏళ్ల లోపు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారితో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు