సామాజిక వెబ్ సైట్లు ఒక ఎత్తైతే.. వాట్సాప్ మరో ఎత్తు. ప్రతి ఒక్కరి ఫోన్లో కనబడే వాట్సాప్... వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా .. బీటా 2.16.264 అప్డేషన్తో స్నాప్‌చాట్ మాదిరిగా.. యూజర్లు తమ ఇమేజ్‌పై టెక్ట్స్, డ్రాయింగ్ వేసుకునేలా సరికొత్త ఫీచర్‌ను కల్పించబోతుంది. ఇవి రాసేందుకు వీలుగా టీ బటన్స్ వాట్సాఫ్ కనిపించనుంది.
మొదట ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ఇదే తరహాలో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉందట. ఈ అధికారిక వెర్షన్‌ను వాట్సాప్ త్వరలో విడుదల చేయనుంది. టెస్ట్ చేయాలనుకునే యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లో తాజా వాట్సాప్ వెర్షన్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే, ఈ ఫీచర్లు వినియోగదారులకు ఇన్స్టాల్ అవుతాయని వాట్సాప్ వర్గాల సమాచారం.