బర్త్‌డే పార్టీ పేరుతో ఆహ్వానం.. ఆపై అత్యాచారం.. బెంగుళూరులో గ్యాంగ్ రేప్!

గురువారం, 19 మే 2016 (15:17 IST)
పార్టీకని పిలిచి 26 యేళ్ల మహిళ జీవితాన్ని నాశనం చేశారో కొంతమంది కామాంధులు. పుట్టిన రోజు వేడుకకని పిలిచి ఇంటికొచ్చిన మహిళపై ముగ్గురు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురుని మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 26 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. బాబు అనే వ్యక్తి తన పుట్టిన రోజు పార్టీకంటూ ఆమెను ఆహ్వానించాడు. దీంతో ఆమె పార్టీకి వెళ్లగా అతడు భుక్తియార్, ఖలీద్ అనే మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మరుసటి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి