సరదా కోసం దొంగతనం.. ఏసీ హోటళ్ళలో భోజనం.. సినిమాలు... షికార్లు...

శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:43 IST)
ఢిల్లీకి చెందిన ఓ కుర్రోడు సరదా కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఆ వస్తువులను విక్రయించి ఏసీ హోటళ్ళలో భోజనం చేస్తూ సినిమాలు, షికార్లు చేయసాగాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీకి చెందిన అమృత్ సింగ్ (19) అనే కుర్రాడు ఐదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత స్నేహితులతో స్నేహం చేసి చెడిపోయాడు. ఏసీలో సేదతీరాలని, ఖరీదైన కార్లలో అర్థరాత్రి ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టాలని కలలుకన్నాడు. ఈ సరదా తీర్చుకునేందుకు తొలుత కార్ల బ్యాటరీలు, ఇతర విడిభాగాలను దొంగిలిస్తూ వచ్చాడు. 
 
అలా వచ్చిన డబ్బుతో ఏసీ హోటళ్లలో భోజనం చేసి ఒక సరదా తీర్చుకునేవాడు. తర్వాత తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్‌లో హోండా సిటీ కారును దొంగిలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతనిని విచారించిన పోలీసులకు తనకు ఏసీ అన్నా, కార్లు అన్నా మోజు అని, ఆ సరదాలు తీర్చుకునేందుకే తాను దొంగగా మారానని వెల్లడించాడు. 

వెబ్దునియా పై చదవండి