ఢిల్లీలో గత నెల 12, 13 తేదీల్లో భూకంపం వచ్చింది. నెల వ్యవధిలోనే ఢిల్లీలో వరుస ప్రకంపనలు రావడం ఆందోళన కలిగించే పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీలో ఆదివారం వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. దుమ్ము, ధూళితో పాటు భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఢిల్లీలో ఉష్ణోగ్రత తగ్గిపోవడమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఢిల్లీలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.