నేడు తిరుపతికి రానున్న మాజీ రాష్ట్రపతి కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గురువారం తిరుపతికి విచ్చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో జరిగే లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకై కలాం తిరుపతికి విచ్చేస్తున్నారు.

ఎస్వీ యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగే లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొననున్న కలాం విద్యార్ధుల్లో దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందే దిశగా సందేశం ఇవ్వనున్నారు. దీనితోపాటు వివిధ కార్యక్రమాల్లో కలాం పాల్గొననున్నారు. కలాం సందేశం వినడం కోసం వేలాదిగా విద్యార్ధులు లీడ్ ఇండియా కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఎస్వీ యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కలాం విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రాష్ట్రపతిగా ఉన్ననాటినుంచి కలాం ఈ లీడ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొంటుండడం విశేషం.

వెబ్దునియా పై చదవండి