ఇరాన్ హక్కులకు భంగం కలగకుంటే సహకరిస్తాం: దినేజాద్

శుక్రవారం, 31 డిశెంబరు 2010 (09:02 IST)
తమ దేశ హక్కులకు, పౌరులకు ఎలాంటి భగంకలుగని రీతిలో ప్రపంచ దేశాలకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ దేశాధ్యక్షుడు అహ్మదినేజాద్ ప్రకటించారు. ఆయన కరాజ్ నగరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ హక్కులకు ఎట్టిపరిస్థితుల్లో భంగం కలగనీయబోనని ప్రకటించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలన్నీ చట్టవిరుద్ధమైనవిగా ఆయన ఆరోపించారు. ఇలాంటి తీర్మానాలన్నీ ఇరాన్ మరింత బలోపేతం కావడానికి సహకరించాయని ఆయన అన్నారు.

అంతేకాకుండా, ఇపుడు ఇరాన్ అణుశక్తి సామర్థ్యాన్ని కలిగిన దేశంగా ఆయన ప్రకటించారు. ఇరాన్ అణు శక్తి కార్యక్రమానికి వ్యతిరేకంగా అమెరికా దాని మిత్రదేశాలూ కలిసి చేస్తున్న రాజకీయ ప్రచారపరమైన ఒత్తిడీ, తీర్మానాలన్నీ విఫలమయ్యాయన్నారు. అణు విద్యుదుత్పత్తి అవసరాలకు తగిన అణు సాంకేతిక సామర్థ్యాన్ని ఇరాన్ సమకూర్చుకుందని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి