అందుకు పరమేశ్వరుడు- 'శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామతత్సుల్యం రామనామ వరాననే ||' అని మూడుసార్లు స్మరించినట్లైతే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, అభేదస్వరూపులమైన మావల్ల భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు పార్వతికి మంత్రోపాసన చేశాడు.