బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

సెల్వి

శనివారం, 19 జులై 2025 (15:44 IST)
Dogs
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసిన ఘటనలో ఆ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం రూప్లా తండాకు చెందిన జరుప్ల హోబ్యా, లావణ్య దంపతులకు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
చివరివాడు నితున్ (3) పుట్టిన రోజు గురువారం కావడంతో గ్రాండ్‌గా వేడుక ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం నితున్ ఒక్కడే సమీపంలోని షాప్‌కు వెళ్లాడు.అదే సమయంలో దాదాపు ఆరేడు వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా బాలుడు నితున్‌పై దాడి చేశాయి. బాలుడిని తీవ్రంగా కరిచి లాక్కెళ్లయ్యాయి. 
 
దీంతో గమనించిన స్థానికులు కుక్కలను తరిమేశారు. అప్పటికి నితున్ అపాస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో నిత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆ బాలుడిని నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే నితున్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో నితున్ కుటుంబంలో విషాదం అలముకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు