చిన్నారి ప్రాణాలను బలితీసుకున్న ప్లాస్టిక్ కవర్: ముఖానికి కప్పుకుని.. మెడకు చుట్టేయడంతో..?!

బుధవారం, 29 జూన్ 2016 (15:46 IST)
ఓ ప్లాస్టిక్ కవర్ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. గుంటూరు జిల్లా నర్సరావు పేటకు చెందిన దంపతులు నిజాంపేట్‌లోని ద నెస్ట్ అపార్ట్ మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి శ్రేయాన్ అనే నాలుగేళ్ల బాలుడున్నాడు. మంగళవారం ఇంట్లో ఆడుకోవడానికని శ్రేయాన్ ప్లాస్టిక్ కవర్ తెచ్చుకున్నాడు. 
 
ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కవర్‌ని ముఖానికి కప్పుకున్నాడు. అనంతరం ఆ కవర్‌ని మెడకు చుట్టుకున్నాడు. దీంతో ఊపిరాడక బాలుడు స్పృహ తప్పిపడిపోయాడు. బాబు ఏం చేస్తున్నాడా అని తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి శ్రేయాన్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే తల్లితండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే శ్రేయాన్ చనిపోయాడు. అప్పటివరకు ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వెబ్దునియా పై చదవండి