సెక్సీతార ముమైత్‌ఖాన్‌ కొత్త చిత్రం ప్రారంభం

WD
బయోస్కోప్‌ అండ్‌ శ్రీమాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై, సెక్సీతార ముమైత్ ఖాన్ హీరోయిన్‌గా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది.

టార్గెట్, పున్నమినాగు వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో సెక్సీతారగా అందాలను ఆరబోసిన ముమైత్ ఖాన్, కొత్త చిత్రం ప్రెస్‌మీట్‌కి చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది.

ఎప్పుడూ కురుచ దుస్తులతో దర్శనమిచ్చే ముమైత్, చీరకట్టుతో వచ్చి అందరి చూపును తనవైపు మళ్లించుకుంది.

ఇకపోతే.. .యతిరాజ సంపత్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి కనుపర్తి శ్రీనివాసప్రసాద్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఈ సినిమా విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. చక్కటి కథ లభించింది. తొలి షెడ్యూల్‌ రామోజీ ఫిలింసిటీలో జరిగిందన్నారు. ప్రస్తుతం విశ్వేశ్వరయ్య గెస్ట్‌హౌస్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ముంబైలో కొంత షూటింగ్‌ చేసి ఆ తర్వాత బ్యాంకాక్‌కు బయలుదేరుతామని నిర్మాత చెప్పారు.

ముమైత్‌ఖాన్‌ మాట్లాడుతూ, ఇది వైవిధ్య కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదని చెప్పింది. ఇందులో తాను వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నానని, దర్శకుడు యతిరాజ్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఆమె వెల్లడించింది.

హీరో అక్షయ్ మాట్లాడుతూ, ఇది కమర్షియల్‌ అంశాలతో రూపొందుతోన్న సినిమాలో చక్కటి పాత్ర పోషిస్తున్నానని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో సోనాటి, ఇసాన్‌, భరత్‌, పృథ్వీ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: బి.వి. ప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: మధురెబ్బ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యతిరాజ సంపత్‌కుమార్‌.

వెబ్దునియా పై చదవండి