'ప్రిన్స్' మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్... 'శ్రీమంతుడు' ఆగస్టు 7న విడుదల
గురువారం, 18 జూన్ 2015 (14:28 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ విడుదల తేదీని మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 7న నిర్ణయించారు. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా మారింది. ఈ సినిమా ఆడియోను జూలై 18న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నాడు. చిత్రంపై క్రేజ్ ఏర్పడింది.