దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను బుట్టలో వేసుకుంది. 15 ఏళ్ల సినీ కెరీర్ వున్న నయన చేతిలో ఇప్పటికీ ఆఫర్లు బోలెడున్నాయి. ఈ అమ్మడు మూడేళ్లుగా డైరక్టర్ విఘ్నేశ్‌తో ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లిపై చర్చ సాగుతున్నా.. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునేందుకు వీరిద్దరూ సిద్ధంగా లేరు.