కన్నడంలో ఘన విజయం సాధించిన 'రెడ్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్. కామిని, రాహుల్, రాజ్ ఆర్యన్, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్ పిక్చర్స్ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య.. ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది. ఈ చిత్ర విశేషాలపై నిర్మాత భరత్ మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి.. ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం.