ఇద్దరు కూతుళ్ళ తండ్రివి.. లైంగిక వాంఛలు తగ్గలేదు : అనూ మాలిక్‌పై గాయని ఫైర్

ఆదివారం, 17 నవంబరు 2019 (13:08 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు అనూ మాలిక్‌కు బాలీవుడ్ గాయని సోనా మొహాపాత్ర ఓ ఉచిత సలహా ఇచ్చారు. సెక్స్ రిహాబ్ సెంటర్‌కు వెళ్లాలని సూచన చేశారు. తనపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మౌనంగా ఉండడమే తను చేసిన తప్పని మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనూ మాలిక్ తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. తాను ఎవరినీ లైంగికంగా వేధించలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై మీటూ ఆరోపణలు చేసిన గాయని సోనా మొహాపాత్ర స్పందించారు. 'తప్పు చేసిన నీకే అంత బాధగా ఉంటే.. వేధింపులు ఎదుర్కొన్న మా పరిస్థితి ఎలా ఉంటుంది. టీవీ షోలలో కనిపించేందుకు నువ్వేమీ రోల్ మోడల్‌వి కావు. కావాలంటే సెక్స్ రీహాబ్ సెంటర్‌కి వెళ్లు. 
 
ఇద్దరు కూతుళ్లకు తండ్రివి అయినంత మాత్రాన నువ్వు మంచివాడివి అయిపోవు. ఇద్దరు కూతుళ్లకు తండ్రివి అయినా నీలో లైంగిక వాంఛలు తగ్గలేదు. టీవీ షోలలో కనిపించే హక్కు నీకు లేదు. కావాలంటే నీ కూతుళ్లను ఉద్యోగాలు చెయ్యమను. నేను ఒక్కదాన్నే కాదు.. చాలా మంది నీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు' అని సోనా ఘాటుగా వ్యాఖ్యానించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు