కోళికోడ్ విమాన ప్రమాదానికి ప్రధాన కారణమిదే!!

ఆదివారం, 9 ఆగస్టు 2020 (14:37 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదానికి ప్రధాన కారణం తెలియవచ్చింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టగా, ప్రాథమికంగా ఓ కారణాన్ని గుర్తించారు. 
 
విమానంలోని డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(డీఎఫ్‌ డీఆర్‌), కాక్‌పీట్‌ వాయిస్‌ రికార్డర్‌(సీవీఆర్‌-బ్లాక్‌బాక్స్‌)లను స్వాధీనం చేసుకుంది. వాటిని విశ్లేషించేందుకు ఢిల్లీకి తరలించింది. అయితే.. బొయింగ్‌ 373-800 విమానం రన్‌వేపై కాకుండా.. ట్యాక్సీవేపై దిగడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించార. 
 
కాగా, గత శుక్రవారం సాయంత్రం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం తొలిప్రయత్నంలో రన్‌వేకు ఒకవైపు నుంచి దిగేందుకు ఏటీఎస్‌ అనుమతినిచ్చింది. అక్కడ నీరు ఎక్కువగా నిలవడంతో.. పైలెట్‌ మళ్లీ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లి, రెండు చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత ఏటీఎస్‌ అధికారులు రన్‌వే రెండోవైపు నుంచి దిగాలని సూచించారు. 
 
ఆ క్రమంలో రన్‌వేకు కిలోమీటర్లు దూరంలో ఉన్న ట్యాక్సీవేపై పైలట్‌ విమానాన్ని దించారని భారత విమానాశ్రయాల సంస్థ(ఏఏఐ) తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఒక విమానం రన్‌వేపై దిగాక పైలెట్‌కు సూచించిన టెర్మినల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీవేపైకి విమానాన్ని పోనిస్తారు. విమానం కిందకు దిగేప్పుడు కొన్ని వందల టన్నుల బరువు రన్‌వేపై పడుతుందని, దాన్ని ట్యాక్సీవే తట్టుకోలేదని, ఆ కారణంగానే విమాన ప్రమాదానికిగురై ఉంటుందని విమానాశ్రయ ఇంజనీర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు