ఇంటి నిర్మాణంలో సింహ ద్వారం ఎత్తు ఎంత ఉండాలి?

File
FILE
ఇంటి నిర్మాణంలో అత్యంత ప్రధానమైనది ప్రధాన ద్వారం. ఈ ద్వారాన్నే సింహ ద్వారంగా పిలుస్తారు. అలాంటి ద్వారాన్ని బిగించేందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న అంశంపై అనేక సందేహాలు ఉంటుంటాయి. ఈ సందేహ నివృత్తిపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే..

మనిషి శరీరానికి నోరు ఎంత ప్రాముఖ్యమో ఇంటికి కూడా ద్వారం అంతే ప్రాధాన్యమంటున్నారు. ప్రధాన ద్వారం పెడుతున్నామంటే దానిని అనుసరిస్తూ మిగిలిన ద్వారాలు ఉంటాయి. అందువల్ల ఇంటి మొత్తానికి సింహ ద్వారం బిగించే ముందు మిగతా గదుల విభజన వాటి ద్వారాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు.

సాధారణంగా ప్రధాన ద్వారం ఎత్తు నాలుగున్నర అడుగులు లేదా ఐదు అడుగులు మాత్రమే ఉండాలని మన పురాణాలు చెపుతున్నాయి. అయితే, ఆధునిక కాలంలో మనిషి తనకు అనుకూలంగా ఈ ప్రధాన ద్వారాలను తయారు చేసుకుంటున్నారు. సాధారణంగా మనిషి ఉండే ఎత్తుకంటే అదనంగా మరో మూడు అడుగుల ఎత్తు ఉండేలా తయారు చేసుకుంటున్నారు.

ఇక ద్వారం వెడల్పు విషయానికి వస్తే తప్పనిసరిగా 3 ఫీట్ల 6 అంగుళాలు ఉండాలి. 4 వెడల్పు కూడా పెట్టుకోవచ్చు. ద్వారం బిగించేటప్పుడు గోడకు చేర్చి బిగించకూడదు. కొద్దిగా గోడ రావాలి. దానినే మనం 'మొత్త' అంటాం. ఈ మొత్త 6 అంగుళాలకు తక్కువ కాకుండా ఉండాలని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి