తోబుట్టువులు పడమర వైపున నివాసముండొచ్చా?

శుక్రవారం, 21 సెప్టెంబరు 2012 (17:49 IST)
File
FILE
చాలా మంది అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఒకే చోట స్థలాలను కొనుక్కొని, ఎవరికి అనుకూలంగా ఉన్న దిక్కున వారు గృహాలు నిర్మించుకుని జీవిస్తుంటారు. ఇలాంటి వారిలో అక్క లేదా అన్న ఇంటికి వెనుక పైవు అంటే పడమర వైపు చిన్నవారు (తమ్ముడు లేదా చెల్లెలు) నివశించా అనే ధర్మసందేహం చాలా మందిలో నెలకొనివుంటుంది.

దీనిపై వాస్తు నిపుణుల అభిప్రాయాన్ని కోరితే.. ఒక గృహంలో ఉంటున్నప్పుడు ఆ ఇంటికి దక్షిణంలో కాని, పడమరలో కాని తమ్ముడు కొన్నప్పుడు అది దోషం కాదంటున్నారు. వాస్తవానికి అన్న పైభాగంలో అనగా దక్షిణ వైపున, లేదా పడమర భాగంలో ఉండాలని భావిస్తున్నారు. కానీ, ఈ విధానం అన్ని సందర్భాల్లో వర్తించదని చెపుతున్నారు.

ముఖ్యంగా ఒకే ప్రాంగణమై, ఒక ఇంటిని అన్నదమ్ములు పంచుకునేటప్పుడు, ఒకే కాంపౌండు వాల్ కలిగిన స్థలంలో అన్నదమ్ములిద్దరు రెండు ఇండ్లు కట్టుకుంటున్నప్పుడు ఎవరు ఎటువైపు ఉండాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అపుడు మాత్రమే పెద్దవాళ్లు పైభాగమైన దక్షిణంలో కానీ పడమరలో కానీ ఉండాలని వాస్తు శాస్త్రం చెపుతోంది. వేర్వేరు చోట్ల.. వేర్వేరు గృహాలు ఉన్నపుడు మాత్రం ఇవేమీ వర్తించవని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి