పెళ్లి చేయబోతే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి

గురువారం, 30 జులై 2020 (17:52 IST)
పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం ఆమెకి ఆగ్రహం తెప్పించింది. వెంటనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని మృత్యుంజయపురం గ్రామానికి చెందిన 19 ఏళ్ల అశ్వని బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అంజయ్య, సీతయ్యలు నిర్ణయించారు. అందుకు ఆమె ససేమిరా అనడమే కాకుండా ఆగ్రహంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు