ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్మెంట్ రెండుసార్లు అడిగా, మూడోసారి కూడా: బాలయ్య

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని ఇప్పటికే రెండుసార్లు అపాయింట్మెంటును కోరినట్లు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కుటుంబడిందనీ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు పెచ్చరిల్లాయంటూ చెప్పారు. 
 
కాగా హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రూ. 55 లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందచేశారు. తను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేనన్న విషయంపై స్పందిస్తూ... నేను ఎక్కడ వున్నా నా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేసి తీరుతానన్నారు బాలయ్య. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు