ఏపీకి మూడు రాజధానులు.. హైకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

సోమవారం, 3 ఆగస్టు 2020 (22:07 IST)
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో ఇప్పుడు అమరావతి రైతులు న్యాయపోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు. 
 
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. గెజిట్ ప్రకటనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటన చేయాలని పిటీషనర్... తన పిటీషన్‌లో కోరారు. వీటి అమలు పై స్టే ఇవ్వాలని హైకోర్ట్‌ని విజ్ఞప్తి చేశారు.
 
రాజ్ భవన్, సీఎం కార్యాలయం, విభాగధిపతులు కార్యాలయాలు… సచివాలయం అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్ట్‌కి దాఖలు చేసిన పిటీషన్‌లో కోరారు. అదే విధంగా జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలని పిటీషనర్ కోరారు. దీనిపై మంగళవారం హైకోర్ట్ విచారణ చేపట్టే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు