ఏపీలో వాలంటీర్లకు శుభవార్త - జనవరి ఒకటి నుంచి రూ.750 పెంపు

శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి ఒకటో తేదీ నుంచి వేతనాన్ని పెంచుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా మరో రూ.750 కలిపి అందజేస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుకంగా ఈ ప్రకటన చేశారు.
 
ఆయన గురువారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌ కానుకగా వాలంటీర్లకు జీతం అదనంగా రూ.750 పెంచుతున్నట్టు చెప్పారు. పెంచిన వేతనాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అందుకుంటారు తెలిపారు. పనిలోపనిగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. 
 
వారిద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో జగన్ పాలన పోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో సుభిక్షంగా కొనసాగుతుందని, దీన్ని ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోమారు ముఖ్యమంత్రి ఖావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు