ఎన్టీయార్ అత్యంత ఖరీదైన కారు కొనుగోలు

గురువారం, 4 మార్చి 2021 (09:34 IST)
అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును ఎన్టీయార్ కొనుగోలు చేశాడట. ఎడారి ప్రాంతం, సాధారణ రోడ్లు, కొండ ప్రాంతం.. ఇలా ఎక్కడైనా పరుగులు తీసే ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ధర సుమారు 5 కోట్ల రూపాయలట.

విలాసవంతమైన ఈ కారు ఇటలీ నుంచి భారత్‌కు దిగుమతి అవుతోందట. ఈ కారును ఎన్టీయార్ తనకు నచ్చిన విధంగా తయారు చేయించుకున్నాడట. త్వరలోనే ఈ కారు హైదరాబాద్ చేరుకోనుందట. 
 
ఎన్టీయార్ లైఫ్ స్టైల్ గురించి ఇటీవలి కాలంలో తరచుగా వార్తలు వస్తున్నాయి. నిజ జీవితంలో అతను వాడే వస్తువులు, వాటి బ్రాండ్స్, ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త కారు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీయార్‌‌కు లగ్జరీ కార్లంటే ఉన్న మక్కువ తెలిసిందే. తరచుగా కార్లను మార్చే ఎన్టీయార్ గ్యారేజ్‌లోకి త్వరలో ఓ కొత్త కారు రాబోతోందట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు