స్థానిక ఎన్నికలు : ఏకగ్రీవాలకు పెరిగిన నజరాన

శుక్రవారం, 13 మార్చి 2020 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అలాంటి పంచాయతీలకు నజరానాను పెంచుతూ పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో 15 వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.7 లక్షలు, 15 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన వాటికి రూ.20 లక్షలు నజరానా ఇచ్చేవారు. 
 
తాజాగా ప్రభుత్వం వాటిని సవరించింది. 2 వేల జనాభాకంటే తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు, 2-5 వేల లోపు జనాభా ఉంటే రూ.10 లక్షలు, 5-10 వేల లోపు ఉంటే రూ.15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకిచ్చే ఈ నజరానాతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు