గవర్నర్ ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రగిరి టీడీపీ నేతల నిరసనలు

శనివారం, 1 ఆగస్టు 2020 (17:12 IST)
ఏపీలో మూడు రాజధానిలో ఆమోదిస్తూ గవర్నర్ సంతకం పెట్టడంతో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు భగ్గుమన్నారు.

అమరావతి జేఏసీ కోరిక మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు ఇవ్వటంతో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు  తిరుపతిరూరల్, పాకాల, రామచంద్రపురం మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.

మూడు రాజధానుల అంశంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న గవర్నర్ ఆమోదంను న్యాయ స్థానం కొట్టివేయాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు