చంద్రబాబుకు కరోనా, చెప్పిందెవరో తెలుసా..?

బుధవారం, 26 ఆగస్టు 2020 (18:08 IST)
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. కరోనా ప్రారంభం నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్న చంద్రబాబుకు కరోనా వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
 
కరోనా రావడంతో ఇంట్లో ఐసోలేషన్లో చంద్రబాబు ఉన్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఉన్న చంద్రబాబుకు బయట ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లు, ఐసోలేషన్లలో వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవ చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్సలు చేయడం సరైంది కాదన్నారు.
 
చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు బయటకు వచ్చి క్వారంటైన్లలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారో చూడాలే తప్ప అనవసరంగా ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. తిరుపతిలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ మీటింగ్‌లో మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మాట్లాడిన నారాయణస్వామి ప్రతిపక్ష నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు