కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది.. ఇరానీ ఛాయ్ కూడా..?

శనివారం, 13 జూన్ 2020 (11:03 IST)
హైదరాబాదులో కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది. హైదరాబాదులో కరోనా విజృంభించడంతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. లాక్ డౌన్‌లో సడలింపులు చేయడంతో ఇటీవలే తెరుచుకున్నాయి. కానీ హోటళ్లు తెరిచినప్పటికీ గిరాకీ బాగా తగ్గినట్టు యజమానులు చెబుతున్నారు. కరోనా భయానికి హోటల్స్‌‍లో కూర్చొని తినడానికి జనాలు మొగ్గు చూపట్లేదట.
 
అయితే టేక్ అవేకి మాత్రం కొంత మేరకు డిమాండ్ ఉన్నట్టు చెబుతున్నారు. హోటల్‌లో తినడానికి భయపడుతున్న జనాలు పార్సిల్స్ తీసుకుని వెళుతున్నారు. ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఇదివరకు పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో అమ్ముడుపోతున్నట్టు తెలుస్తుంది. కేవలం బిర్యానీ కాకుండా ఛాయ్ కేఫ్‌ల వద్ద కూడా జనాలు కనిపించట్లేదు. ఫలితంగా ఇరానీ ఛాయ్ గిరాకీ కూడా తగ్గిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు