జగన్ సర్కారు జానపద అకాడమీ కమిటీని ఏర్పాటు చేయాల్సిందే..

శనివారం, 31 ఆగస్టు 2019 (12:10 IST)
జానపద అకాడమీ కమిటీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి 
ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారులు సమైక్య రాష్ట్ర కన్వీనర్ దేవిశ్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
 
రాష్ట్ర ప్రభుత్వం జానపద అకాడమీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఒక ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారులు సమైక్య రాష్ట్ర కన్వీనర్ దేవిశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానపద కళలును రక్షించుకోవాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు వాటిపైనే ఆధారపడి ఉన్నాయని అన్నారు. జానపద కళలను కళాకారుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
మన రాష్ట్రంలో జానపద కళలు అంతరించిపోతున్న తరుణంలో వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందని అన్నారు. తప్పెటగుళ్ళు గంగిరెద్దులాట చెక్కభజన బయట భజన తూర్పు భాగవతం లాంటి కళలు అంతరించిపోతున్న నేపథ్యంలో జానపద అకాడమీ వెంటనే ఏర్పాటు చేసి మన పురాతన కళలను తిరిగి బ్రతికించు కోవాలని కోరారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జానపద అకాడమీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నామని దేవిశ్రీ తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికలు దగ్గర ఉన్నందున ఆయా కమిటీలు వేసి చేతులు దులుపుకుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీలు రద్దు చేసిన నేపథ్యంలో తిరిగి వెంటనే జానపద అకాడమీ కమిటీని ఏర్పాటు చేయాలని... మన సంపద అయినటువంటి జానపద కళలు తిరిగి బ్రతికించు కోవాలని దేవిశ్రీ తెలిపారు.
 
జానపద కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు స్థలాలు రేషన్ కార్డులు అర్హులైన కళాకారులకు పెన్షన్లు జానపద కళాకారులు కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు. జానపద కళాకారుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్‌లో ఉచితంగా చదువు చెప్పించాలని దేవిశ్రీ డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు