దాతలు ముందుగా అనుమతి తీసుకోవాలి: మచిలీపట్నం ఆర్డివో

శుక్రవారం, 8 మే 2020 (21:40 IST)
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డివిజనల్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం ఆర్టిఓ ఆఫీస్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీవో ఖాజావలి మాట్లాడుతూ.. మచిలీపట్నంలో నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీ చేయాలనుకునే దాతలు ముందుగా బందరు ఆర్డివో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించి, పర్మిషన్ తీసుకోవాలని. అలా పర్మిషన్ తీసుకున్న వారు ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల లోపు వాళ్లు చేయదలుచుకున్న కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అని తెలిపారు.

మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న వలస కార్మికులు వారు ఏ ప్రాంతాలకు అయితే వెళ్లాలో ముందుగా ఆర్డీవో లేదా తాసిల్దార్ కార్యాలయంలో నేరుగా గాని లేదా ఆన్లైన్ లో గాని తమ పేర్లను వెళ్ళవలసిన ప్రదేశాలను నమోదు చేసుకోవాలని, అలా వచ్చిన అర్జీలను పరిశీలించి వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు రోజుకొక రాష్ట్రమునకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

నిన్న మహారాష్ట్ర కార్మికులను రైళ్ల ద్వారా తమ రాష్ట్రానికి పంపించినట్లు తెలిపారు. రేపు ఉదయం బీహార్ వెళ్లే రాష్ట్రానికి సంబంధించిన వలస కూలీల పంపుతున్నట్లు తెలిపారు.  అలా రాష్ట్ర పరిధిలో జిల్లాలు గానీ, ఇతర రాష్ట్రాలు గాని వచ్చిన అర్జీల ఆధారంగా రైళ్లను నడిపే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రాథమిక రంగానికి సంబంధించిన వ్యవసాయ,వ్యవసాయ అనుబంధ మత్స్య సంబంధమైన మరియు ఎరువులు షాపు యజమానులు తమ షాపులు తీసుకోవడానికి, పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా పర్మిషన్ తీసుకున్న షాపుల యజమానులు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

మచిలీపట్నంలో ముస్లిం సోదరులు ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా నివాసం ఉంటున్నారో వారికి ఉపయుక్తంగా రాజుపేట మాచవరం మార్కెట్ యార్డ్ రైతు బజార్లు అదనంగా ఒక గంట అనగా 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ ప్రదేశాల్లో నిత్యావసర సరుకులు, మరియు డ్రై ఫ్రూట్స్ వస్తువులు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు