వైకాపా వంద రోజుల పాలనలో సీఎం జగన్.. మాజీ ఎంపీ సబ్బం హరి

ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (13:10 IST)
హైదరాబాద్: వైకాపా వందరోజుల పాలనలో సీఎం జగన్ విఫలమైనట్లు మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోపించారు. నవరత్నాలలో ఎన్ని ప్రజలకు చేరువయ్యాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పాజిటివ్‌ థృక్పథంతో వెళ్తే ఫలితం వుండదని.. ప్రజావేదికను కూల్చి ఏం సాధించారని ప్రశ్నించారు. 
 
ఈ రోజు వరకు కరకట్ట మీదున్న ఏ భవనాన్ని కూల్చలేదని, సీఎం జగన్‌ ఆలోచనా ధోరణి సరిగా లేదనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని వేగంతో పోలవరం పనులు చేయించారని, టీడీపీ, ఎన్డీఏ నుంచి బయటికొచ్చాక పోలవరం పనుల వేగం తగ్గిందని సబ్బం హరి వ్యాఖ్యానించారు. 
 
ఎన్నికల ముందు పోలవరం విషయంలో వైసీపీ కేంద్రాన్ని ప్రభావితం చేసిందని దుయ్యబట్టారు. ఇప్పుడు పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెబుతోందని, రీటెండరింగ్‌కు వెళ్తే చిక్కులు వస్తాయని చెప్పినా పట్టించుకోవడం లేదని సబ్బం హరి ధ్వజమెత్తారు. 
 
చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని నిరూపించడానికి కుట్ర చేస్తున్నారు. అందులో భాగమే పోలవరంలో అవినీతి అంటూ తెరపైకి తెచ్చారు. జగన్‌ తన మార్క్‌ చూపించడానికి పోలవరం పనులు ఆపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు