అమరావతిలో రైతుల నిరసన దీక్షలు

శనివారం, 17 అక్టోబరు 2020 (13:06 IST)
మంగళగిరి మండలం నీరుకోండ గ్రామంలో రైతుల నిరసన దీక్షలు 305 రోజులు శనివారం రాజధాని అమరావతికి మద్దతుగా  నిర్వహించారు.
 
నిరసన కార్యక్రమంలో  నన్నపనేని నాగేశ్వరరావు, నన్నపనేని అరుణ, మాదల కుసుమ, మువ్వ ఇందిరా, నన్నపనేని పద్మ, మాఘం అశోక్ కుమార్, మాదల వెంకటేశ్వరరావు, ముప్పాళ్ళ సాంబశివరావు, ముప్పవరపు రాము, తదితరులు పాల్గొన్నారు.
 
పెనుమాకలో...
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 305వ రోజు నిర్వహించారు.
  
మూడు  రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు. 
 
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు షేక్ సాబ్ జాన్,మన్నవ వెంకటేశ్వరరావు, గుంటక సాంబిరెడ్డి,ముప్పేర మాణిక్యాలరావు ,మోదుగుల తాతయ్య,బొప్పన బుల్లెబ్బాయి, గోగినేని నాగేశ్వరరావు, తదితర రైతులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు