విజయవాడను నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారు: కేశినేని నాని

శనివారం, 27 ఫిబ్రవరి 2021 (14:51 IST)
శనివారం ఉదయం విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ ,18వ డివిజన్లలో సీపీఐ బలపర్చిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు శ్రీ ముని పోలిపల్లి, శ్రీ మైలమూరి పీరుబాబుల విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ శ్రేణులతో కలిసి రాణిగారి తోట, సిమెంట్ గోడౌన్ నుండి మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని నాని గారు, ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ... 21 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరానికి చేసిన అభివృద్ధి శూన్యం. విజయవాడను నాశనం చేయటానికి జగన్ కంకణం కట్టుకున్నారు, రాజధానిని మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారు.
 
నిత్యావసర సరుకుల ధరలు 40 శాతం పెరగడం వల్ల పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పక్క రాష్ట్రల్లో కన్నా మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువ.
 
మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, డ్రైనేజీ పన్నులు 5 రెట్లు పెంచి ప్రజలపై ఆర్థిక భారం ఎలా మోపుతారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరంలో రోడ్డుపైన ఒక్క గుంత కూడా పూడ్చలేకపోయారు. రాష్ట్రంలో 30 శాతం మందికే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. విజయవాడ నగర అభివృద్ధికి టిడిపికి, మిత్రపక్షమైన సిపిఐకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు