ఇకపై నేనే చూసుకుంటా... తాత సమాధి సాక్షిగా ఎన్టీఆర్ శపథం.. ఏంటది?

మంగళవారం, 28 మే 2019 (10:23 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్ శపథం చేశారు. అదీ కూడా హైదరాబాద్‌లోని తన తాత స్వర్గీయ ఎన్.టి.రామారావు సమాధి సాక్షిగా ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే.. ఇకపై ప్రతి యేడాది ఎన్టీఆర్ జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని చెప్పారు.
 
ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించేందుకు తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చారు. 
 
నిజానికి ఎన్టీఆర్ జయంతి లేదా వర్థంతి రోజుల్లో సమాధి మొత్తం వివిధ రకాల పూలతో ఎంతో అందంగా సుందరీకరిస్తారు. కానీ, మంగళవారం సమాధి వద్దకు హీరోలు వచ్చేసరికి సమాధిపై ఒక్కకంటే ఒక్క పువ్వు కూడా లేదు. దీన్ని చూసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తీవ్ర అసహనానికి గురయ్యారు. 
 
ఆ తర్వాత పూలను తానే తెప్పించి, తన ఫ్యాన్స్ సహాయంతో సమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీయార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు