అక్టోబర్‌ 16న కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం

సోమవారం, 5 అక్టోబరు 2020 (06:50 IST)
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌ వంతెన ప్రారంభోత్సవం అక్టోబర్‌ 16న జరగనుంది.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలిసి రహదారిని ప్రారంభిస్తారని రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. వర్చువల్ విధానంలో ఇరువురు నేతలూ పైవంతెనను ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.

దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లోనూ కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ పాల్గొంటారని ఆయన అన్నారు.

పై వంతెనతో పాటు పూర్తయిన మరికొన్ని ప్రాజెక్టులను నితిన్‌ గడ్కరీ, సీఎం జగన్‌ జాతికి అంకితం చేస్తారని కృష్ణబాబు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు