అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్... నేడు సీఐడీ విచారణకు

మంగళవారం, 10 అక్టోబరు 2023 (11:21 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవినీతి జరిగిందంటూ అధికార వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారా లోకేశ్ ఏ14గా ఉన్నారు. దీంతో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సీఐడీ నిర్ణయించి, నోటీసు జారీచేసింది. తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొంది. మరోవైపు, దీంతో ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 
 
కావాల్సిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం కోసం రింగ్ రోడ్డు అలైన్మెంట్‌ను ఉద్దేశ్యపూర్వకంగా మార్చారనే అభియోగాలను ఈ కేసులోని నిందితులపై సీఐడీ మోపింది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకే‌శ్‌కు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 
 
అయితే, లోకేశ్‌ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశారు జారీ చేసింది. విచారణ సమయంలో ఆయన తరపు న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారుల ఎదుట లోకేశ్ హాజరుకానున్నారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు