చంద్రబాబు కోసం న్యాయపోరాటం.. కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ లీగల్ టీమ్

గురువారం, 14 సెప్టెంబరు 2023 (20:33 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు న్యాయకోవిదులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబు తరపున హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇపుడు టీడీపీ లీగల్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. 
 
చంద్రబాబు తరపున టీడీపీ లీగ్ టీమ్ న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని నిశితంగా పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందికదా అని ప్రశ్నించారు. అయితే, కస్టడీ పిటిషన్‌కు, బెయిల్ పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది సబ్బారావు స్పష్టం చేశారు. 
 
ఆ తర్వాత ఆ పిటిషన్‌ను అనుమతించిన న్యాయమూర్తి ఏపీ సీఐడీకి నోటీసులు జారీ చేశారు. కాగా, ఇప్పటికోసం హౌస్ కస్టడీ కోసం, వైకాపా బనాయించిన ఇతర కేసుల్లో బెయిల్ కోసం మాత్రమే ఏసీబీ, హైకోర్టుల్లో పిటిషన్లను బాబు తరపున న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ క్రమంలో తొలిసారి చంద్రబాబు కోసం బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని స్వీకరించిన కోర్టు.. సీఐడీకి నోటీసులు ఇవ్వడం అంటే కీలక పరిణామంగా పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు