ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: సీఎం జగన్

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (15:25 IST)
మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్ను మూశారన్న వార్తతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 6 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేసారు.
 
#RIPSPB అంటూ హ్యాష్ టాగ్ పెట్టారు. ఎస్పీ బాలు పరిస్థితి అత్యంత విషమం అని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచే ఆందోళన మొదలైంది. కమల్ హాసన్ వంటి సన్నిహితులు సహా కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో బాలు ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.
 
ఈరోజు ఉదయం కూడా ఆయన పరిస్థితిపై స్పష్టత రాలేదు. చివరికి మధ్యాహ్నం ఆయన మరణించినట్లు వెల్లడి కావడంతో అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు