ఏపీ క్వారంటైన్ లలో వ్యాధి నిరోధక శక్తి ఆహారం

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:39 IST)
ఏపీలోని క్వారంటైన్ లలో సమృద్ధి కరమైన, పౌష్టికాహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  విదేశాల నుంచి వచ్చినవారికే కాకుండా, ఇటీవల ఢిల్లీలో మర్కజ్ కు వెళ్లొచ్చినవారిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

కరోనా అనుమానితులను 14 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. అయితే, ఈ క్వారంటైన్ లో ఉన్నవారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారో ప్రభుత్వం వెల్లడించింది.

గన్నవరం, నూజివీడు, గంగూరు (విజయవాడ డివిజన్) క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అరటిపండ్లు, కోడిగుడ్లు, బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం వంటి బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నారు.

ఈ తరహా ఆహారంతో క్వారంటైన్ లో ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుందన్నది ప్రభుత్వ వర్గాల భావన. మొత్తమ్మీద కోడిగుడ్లు, డ్రైఫ్రూట్స్ లో స్పెషల్ డైట్ అందజేస్తున్నారు.

అయితే తమకు కనీస సదుపాయాలు కల్పించడం లేదని, అల్పాహారం సైతం ఇవ్వడం లేదంటూ బాధితుల నుంచి వీడియోల వెతలు బయటకు వస్తుండడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు