వైకాపా నేతల మాటలకు నా భార్య ఏడుస్తుంది : పవన్ కళ్యాణ్

మంగళవారం, 11 జులై 2023 (16:31 IST)
వైకాపా నేతలకు మాటలకు తన భార్య ఏడుస్తుందని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే నిలబడి మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఆయన మంగళవారం ఏలూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో పవన్‌ భేటీ అయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'ఎవరో పెట్టిన పార్టీని వైకాపా వాళ్లు తీసుకున్నారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ.. వైకాపా. నన్ను బెదిరించారు. డబ్బుతో మభ్యపెట్టాలని చూశారు. జగన్‌ అంటే కోపం లేదు.. ప్రభుత్వ విధానాలపైనే నాకు ద్వేషం. నాయకులు చేసిన తప్పులు ప్రజలపై ప్రభావం చూపిస్తాయి.
 
ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయి. వాలంటీర్‌ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా? ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది. ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారు. అమ్మాయిల అదృశ్యంపై వైకాపా నేతలు ఎందుకు స్పందించరు? విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నాపై విమర్శలు చేస్తున్నారు. సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్లు, ప్రజలపై దాడులు చేస్తారా? వైకాపా నాయకుల మాటలకు నా భార్య కూడా ఏడుస్తోంది' అని పవన్‌ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు