8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు: ఓటు వేసిన సీఎం వైఎస్ జగన్

శుక్రవారం, 19 జూన్ 2020 (11:54 IST)
దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రాలవారీగా స్థానాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ 4 స్థానాలు, గుజరాత్ 4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్ 3, ఝార్ఖండ్ 2, మణిపూర్ 1, మిజోరం 1, మేఘాలయ 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెలగపూడి అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. వైఎస్సార్సిపి నుంచి అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, తెదేపా నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ తన ఓటును వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు