హైదరాబాద్‌-తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్లు దూరం

మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:33 IST)
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు 122  కిలోమీటర్ల జాతీయ రహదారి  నిర్మాణానికి  కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి  తెలిపింది.

ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్‌ నుంచి తిరుపతి మద్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు,  నంద్యాల  నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. భారతమాత పథకం కింద జాతీయ రహదారికి  అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది.
 
అలాగే ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం  800 కోట్ల  రూపాయలు ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం జరుగుతుంది.

కేంద్ర రవాణాశాఖ మంత్రిని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు ఆచారి, నాగర్‌ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్‌ రావు, నాగర్‌ కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ నెడునూరి దిలీపాచారి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని గడ్కరీ వారికి హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు