మళ్లీ నిమ్మగడ్డ సీరియస్, బలవంతపు ఏకగ్రీవాలపై కలెక్టర్లకు ఆదేశాలు, ఏం జరుగుతుందో?

గురువారం, 4 మార్చి 2021 (09:22 IST)
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ సీరియస్‌ అయ్యింది. అభ్యర్థి మినహా ఇతరులు ఉపసంహరణ పత్రం ఇస్తే తీసుకోకూడదని స్పష్టం చేసింది. అది ఉపసంహరణగా పరిగణించకూడదని తెలిపింది.

బలవంతపు ఉపసంహరణలపై పత్రికల్లో కథనాలు, ప్రసారాలు వచ్చాయని... దీన్ని కమిషన్‌ సీరియస్‌గా తీసుకుందని తెలియజేసింది.

తిరుపతి ఏడో వార్డులో నామినేషన్‌ ఉపసంహరణపై ఫోర్జరీ సంతకం చేసి ఉపసంహరణ చేసుకున్నారని వార్తలు వచ్చాయని, దీనిపై వెంటనే అభ్యర్థి ఆర్‌వో‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది.

పోలీసులు దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీనిని ఎన్నికల నేరంగా పరిగణిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకుంటామని, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఈసీ దృష్టికి తీసుకురావాలని కోరింది. జాయింట్‌ సెక్రటరీ ఫిర్యాదులను తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఈసీ తెలియజేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు