సంక్రాంతికి గన్నవరం-హైదరాబాద్ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు

సోమవారం, 4 జనవరి 2021 (12:04 IST)
సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు గన్నవరం-హైదరాబాద్ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు నడపాలని చవక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 31 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

పదో తేదీ నుంచి 31 వరకు ప్రతి రోజు సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లో విమానం బయలుదేరి ఐదున్నర గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అదే విమానం తిరిగి ఆరు గంటలకు బయలుదేరి రాత్రి 7.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
 
11వ తేదీ నుంచి 28 వరకు మరో కొత్త సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ఈ విమానం విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

16 నుంచి 30 వరకు మరో విమాన సర్వీసు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఇది మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడలో బయలుదేరి 3.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని స్పైస్‌జెట్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు