పిన్నితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడనీ చిన్నాన్న హత్య

ఆదివారం, 18 ఆగస్టు 2019 (16:53 IST)
వరుసకు పిన్ని వరుస అయ్యే మహిళతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే, సంబంధానికి ఆ మహిళ భర్త అయిన వరుసకు చిన్నాన్నను హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండల పరిధి సంఘాయిపల్లికి చెందిన మీసాల మల్లేశ్‌ (26) అనే యువకుడు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో జులాయ్‌గా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఐదేళ్ళ క్రితం తాపీ మేస్త్రీ పని చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో నాగర్‌కర్నూలులో జిల్లా సిద్దాపూర్‌ మండలంలోని పలుగు తండాకు చెందిన సోనీతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొన్ని రోజుల తర్వాత వీరు కులాంతర వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
అయితే, మల్లేశ్ ఇంటికి ఈయన సమీప బంధువైన (వరుసకు కుమారుడు) మెదక్‌పల్లికి చెందిన మీసాల లాలయ్య అలియాస్‌ లాలూ వచ్చి వెళ్లేవాడు. దీంతో వరసకు చిన్నమ్మ అయినా సోనీతో ఇతడు పరిహాసమాడుతుండేవాడు. కుమారుడే కదా అని మల్లేశ్‌ పట్టించుకునేవాడు కాదు.
 
ఈ క్రమంలో సోనీ, లాలూల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో మల్లేశ్‌కు చెప్పారు. దీంతో ఆయన బంధువుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తీరు మార్చుకోవాలని సోనీని, లాలులను హెచ్చరించాడు. 
 
అయినా తీరు మార్చుకోకపోగా, మల్లేశ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మల్లేశ్‌ పొలానికి సంబంధించి రైతుబంధు డబ్బుల కోసం ఈనెల 4వ తేదీన స్వగ్రామానికి వచ్చారు. ఈ విషయాన్ని సోనీ ఫోన్‌ చేసి లాలూకు చెప్పింది. మరుసటి రోజు లాలూ తలకొండపల్లికి వచ్చాడు. అతడు మల్లేశ్‌కు ఫోన్‌ చేసి మద్యం తాగుదామని పిలవడంతో మలేశ్ వచ్చాడు. 
 
అయితే, అప్పటికే తమ పథకంలో భాగంగా, మద్యంలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు. ఈ మద్యాన్ని సేవించడంతో మలేశ్ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతరం లాలూ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి స్వగ్రామానికి వెళ్లాడు. 11వ తేదీన హత్య విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో లాలూతో పాటు.. మల్లేశం భార్యను అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు