ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య.. ఎందుకంటే...

ఆదివారం, 17 మార్చి 2019 (09:51 IST)
ప్రభుత్వ ఉద్యోగం కోసం తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. కానీ, ఆమె ప్రవర్తనే చివరకు ఆమెను పట్టించింది. ఫలితంగా ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌లో పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ స్వీపర్‌ నర్సింహ(35) భార్య లక్ష్మీదేవికి కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన పూసల శేఖర్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.  ఆతర్వాత భర్తను వదిలిపెట్టి  శేఖర్‌తో దేవరకొండకు వెళ్లిపోయి సహజీవనం చేస్తూ వస్తోంది. వీరిద్దరూ గత యేడాది కాలంగా కలిసివుంటున్నారు. ఇటీవలే భర్త వద్దకు వచ్చింది. 
 
ఈ క్రమంలో భర్త నర్సింహను అడ్డు తొలిగించుకోవడంతో పాటు ఉద్యోగం, ప్లాటును పొందాలని పథకం వేసింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. తమ పథకంలో భాగంగా, ఈనెల 3వ తేదీన శేఖర్‌.. నర్సింహను జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి శివారుకు తీసుకు రాగా, మద్యం సేవించిన అనంతం శేఖర్‌, లక్ష్మీదేవిలు కలిసి తలపై బీరు సీసాతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికెళ్లారు. 
 
రెండు మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లక్ష్మీదేవి గురించి ఆ ఊరిలో ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు