వివేకా హత్య కేసు : అవినాశ్‌ రెడ్డికి ఊరట నిచ్చిన తెలంగాణ హైకోర్టు

బుధవారం, 31 మే 2023 (12:25 IST)
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో అతిపెద్ద ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను బుధవారం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తీర్పును వెలువరించింది. అవినాశ్ తల్లి అనారోగ్యం దృష్ట్యా అవినాశ్‌ను ఈ నెల 31వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 
 
ఇదే కేసులో బుధవారం తీర్పును వెలువరించింది. తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసి ఊరటనిచ్చింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చీకటి భేటీ నిర్వహించిన విషయం తెల్సిందే. తన తమ్ముడు, కడప ఎంపీ అవినాశ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఢిల్లీ పరుగెత్తి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలవడం ఆయనకు పరిపాటిగా మారిన విషయం తెల్సిందే. 
 
సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ అవినాశ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు వాడీవేడిగా జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ బయల్దేరడం గమనార్హం. ఈ సమయంలోనే వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్‌కు తెలుసంటూ సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన పేరును సీబీఐ తొలిసారి లిఖితపూర్వకంగా ప్రస్తావించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ అనూహ్య పరిణామం జగన్‌కు రాజకీయంగా గట్టి షాకే ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు