18-10-2020 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్యస్తుతితో..?

ఆదివారం, 18 అక్టోబరు 2020 (04:00 IST)
సూర్యస్తుతితో సూర్యదేవుడిని ఆరాధించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
మేషం: ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం ఇదని గమనించండి. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల్లో మెళకువ చాలా అవసరం. కుటుంబీకుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు నచ్చని సంఘటనలు జరుగుతాయి.  
 
వృషభం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరించండి. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మత్తులు చేపడతారు. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరగలదు. 
 
మిథునం: దైవ, సేవా కార్యక్రమాల్లో దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు. 
 
కర్కాటకం: స్త్రీలకు పనిభారం అధికం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మత్స్య, కోళ్ళ గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
సింహం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైన శ్రద్ధ వహించండి.
 
కన్య: సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. కానివేళల్లో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
తుల: విదేశాలకు వెళ్ళే ఆలోచనను క్రియారూపంలో పెట్టండి. స్నేహితులు, బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలస్యమైనా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది. 
 
వృశ్చికం: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలను ఎదుర్కొంటారు. కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అయిన వారి సలహా తీసుకోవడం మంచిది. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియా రూపంలో పెట్టండి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు: వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ మనోసిద్ధికి ఇది సరైన సమయం అని గమనించగలరు. ప్రముఖుల కలయికతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
మకరం: పండ్ల, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. స్త్రీలు తాము అనుకున్నది సాధించగలుగుతారు. పొట్ట, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికం. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయాల్సివలసివస్తుంది. ఇతరులకు సలహాలిచ్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
కుంభం: పాత వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తేగలుగుతారు. నిరుద్యోగులు నిర్లక్ష్యం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. అందరితో కలిసి విందు,వినోదాల్లో పాల్గొంటారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచలను తగిన విధంగా మలుచుకోండి. స్త్రీలకు అనుకోని అభివృద్ధి, గుర్తింపు లభిస్తాయి. 
 
మీనం: వివాదాస్పద వ్యాఖ్యలతో తలదూర్చకండి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. క్రీడల పట్ల, వస్తువుల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణం తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులౌతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు