16-02-2024 శుక్రవారం దినఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు నెరవేరుతాయి...

రామన్

శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ సప్తమి ప.2.38 భరణి ప.2.20 రా.వ.2.00 ల 3.33.
ఉ.దు.8.50 ల 9.35 ప. దు 12. 36 ల 1.21.
 
పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మేషం :- వైద్య, ఇంజనీరింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. మీ వాక్చాతుర్యం అందరిని ఆకట్టుకుంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ ఆలోచనకూ, ఆచరణకూ మధ్యనుండే ఎడం తగ్గించుకోవాలి. చేపట్టిను పనుల ముగింపుదశలో ఆసక్తి ఉండదు. పెద్దల ఆరోగ్య సమస్యలను అశ్రద్ద చేయరాదు.
 
వృషభం :- పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. ఫైనాన్స్, చిట్స్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగులోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
మిథునం :- బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. షాపు గుమస్తాలు, పనివారలను ఓ కంట కనిపెట్టండి. బ్యాంకు పనులు అనుకూలం. స్త్రీలకు పరిచయాలు, ఇతర వ్యాపకాలు అధికం కావటంతో చికాకులు తప్పవు. వ్యాపారవేత్తలు ప్రస్తుతపరిస్థితిని కొనసాగనివ్వడం మంచిది. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికం అవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. ఉద్యోగస్తులకు అనుకోని ప్రయాణాలు ఎదురుకావచ్చు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
సింహం :- మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులవల్ల ఇబ్బందులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అసవరం. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కన్య :- ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థులు భయాందోళనలువీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
తుల :- బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. సన్నిహితులకు మీరిచ్చిన సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల కోసం ధనం అధికంగా వ్యయంచేస్తారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. స్త్రీలు ఇతరులతో సంభాషించేటపుడు ఏకాగ్రత, మెళుకువ అవసరం. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు.
 
మకరం :- మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కుటుంబంలో ఖర్చుల నిమిత్తంఎక్కువ ధనం వెచ్చించవలసివస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి.
 
కుంభం :- బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచనస్ఫురిస్తుంది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం.
 
మీనం :- ఆర్ధిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. విద్యార్థినులలో మానసిక ధైర్యం, సంతృప్తి చోటుచేసుకుంటాయి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు