06-09-2020 నుంచి 12-09-2020 వరకు మీ వార రాశి ఫలితాలు- video

శనివారం, 5 సెప్టెంబరు 2020 (20:03 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం
అనుకూలతలు అంతంతమాత్రమే. ఓర్పుతో వ్యవహరించాలి, తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సోమ, మంగళ వారాల్లో చేసిన పనే చేయవలసి ఉంటుంది. ఆలోచనలతో సతమవుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంప్రదింపులు వాయిదా పడుతాయి. సంతానం, చదువులపై మరింత శ్రద్ద అవసరం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికం. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. యత్నాలు విరమించుకోవద్దు. గృహంలో స్తబ్థత నెలకొంటుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఏదో ఒక వ్యాపకం సృష్టించుకోండి. పనులు సాగక విసుగు చెందుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. బుధవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించ వద్దు. మీ బలహీనతలు కొంతమందికి లబ్ది కలిగిస్తుంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా పాటించండి. పత్రాలు అందుకుంటారు. పిల్లల చదువులపై మరింత శ్రద్ద వహించాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకలలో అత్యుత్సాహం తగదు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు, 1, 2, 3  పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. అంచనాలు ఫలిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. సభ్యత్యాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యాపకాలు అధికమవుతాయి. గురు, శుక్ర వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంస్థల స్థాపనకు అనుకూలం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. జూదాలు, పందాల జోలికి పోవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. ఇరు వర్గాల వారు మీ సలహా పాటిస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువ పాటించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహ మరమ్మతులు చేపడుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు శుభయోగం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఇంటర్వూలు సంతృప్తినీయవు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
భూ సంబంధిత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. బంధుత్వాలు బలపడుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుమంటారు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహ వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కార్మికులు, వృత్తుల వారికి కష్టకాలం. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది.
 
కన్య: ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మంగళ, బుధ వారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కక పోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు కొత్త బాధ్యతులు, స్థానచలనం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సంతాన యోగక్షేమాలు తెలుసుకుంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ, 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. స్థరాస్తి మూలక ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. గురు, శుక్ర వారాల్లో శ్రమాధికత్య. అకాల భోజనం, మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆలయాలు స్వచ్చంద సంస్థలకు సాయం అందిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి. దూర ప్రయాణం తలపెడుతారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యవహారాలానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆశించిన పదవులు దక్కవు. మనోధైర్యంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పత్రాల రెన్యవల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అనుకూలతలున్నాయి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. సభ్యత్యాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు ముగింపు దశలో హడావిడిగా సాగుతాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంతోషకరమైన వార్తలు వింటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవుల స్వీకరణకు అనుకూలం. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. శని, ఆది వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు హడావిడిగా సాగుతాయి. బంధుమిత్రులు వ్యాఖ్యలు అసహనం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతితో సఖ్యత నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు కష్టకాలం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం అనుకూలిస్తుంది.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వద్దు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సోమ, మంగళ వారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనవసర జోక్యం తగదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వాస్తుకు అనుగుణంగా గృహ మరమ్మతులు చేపడుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. టెండర్లు, ఏజెన్సీలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంధి కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కార్మికులు, చేతివృత్తుల వారికి కష్టకాలం.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. పరిచయాలు బలపడుతాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగొద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆప్తులను కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభ పరిణామాలున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వేడుకలకు యత్నాలు ప్రారంభిస్తారు. పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అర్చక వృత్తుల వారికి సమస్యలెదురవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు