అతిగా వగరు గల పదార్థాలు తింటే ఏమవుతుందో తెలుసా?

శుక్రవారం, 20 నవంబరు 2020 (22:47 IST)
వగరు రుచిని మితంగా సేవిస్తే దోషప్రకోపాలు అదుపులో వుంటాయి. కఫాన్ని పలుచగా మార్చి వదిలించడంలోను, వ్రణాలలోని చెడు మాలిన్యాలను తొలగించడంలోను, వ్రణాలలో హరించిన మాంసాన్ని పూరించడంలోను కషాయ రసం బాగా పనిచేస్తుంది. రక్త, పిత్త వ్యాధులను నివారిస్తుంది.
 
ఐతే ఈ వగరు రుచిని శరీర శక్తికి మించి అధికంగా తీసుకుంటే దుష్ఫలితాలు సంభవిస్తాయి. వాగ్ధాటికి అంతరాయం కలుగుతుంది. రొమ్ము, కడుపులో నొప్పులు వస్తాయి. సంభోగశక్తి సన్నగిల్లుతుంది. శరీరానికి నలుపు రంగు ప్రాప్తిస్తుంది.
 
మలబద్ధకం, దుర్బలత్వాన్ని కలిగించి, వాత, మూత్ర, పురీష శుక్రములు బంధించడానికి కారణమై పక్షవాతం వంటి రోగాలను సైతం కలిగిచడానికి కారణమవుతుంది. అందుకే శరీరానికి అవసరమైన మోతాదుకి మించి ఈ వగరు పదార్థాలను అధికంగా తీసుకోరాదు. ఇది శరీరానికి మిగుల బరువును ఏర్పరచడమే కాకుండా త్వరగా ముసలితనాన్ని కొనితెస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు